నయా సస్పెన్స్‌ స్టోరీ

రుహాణి శర్మ ప్రధాన పాత్ర పోషించిన డిఫరెంట్‌ లేడీ ఓరియెంటెడ్‌ కాన్సెప్ట్‌ సినిమా ‘హర్‌’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 21న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా తాజాగా హీరో వరుణ్‌ తేజ్‌ చేతుల మీదుగా వర్చువల్‌గా ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన అనంతరం ఆయన చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి నిర్మాత రాజ్‌ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. సినిమా చాలా బాగుంది. ఈ మధ్య వచ్చిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్స్‌ అన్ని మంచి హిట్‌ అయ్యాయి. ఈ సినిమాలో కూడా ఒక కేసుని తీసుకొని దాన్ని చాలా బాగా సాల్వ్‌ చేశారు. అందులోనూ ఫిమేల్‌ లీడ్‌తో చేయడం నాకు బాగా నచ్చింది. రుహాణితోపాటు నటీనటులంతా బాగా యాక్ట్‌ చేశారు. సినిమాటోగ్రాఫర్‌ విష్ణు చాలా బాగా తీశాడు. ఈ సినిమా మంచి హిట్‌ అవుతుంది. నిర్మాతలకు బాగా డబ్బులు వస్తాయి. ఇటీవల ఫస్ట్‌ సినిమా తీసే డైరెక్టర్స్‌ అంతా హిట్స్‌ కొడుతున్నారు. శ్రీధర్‌ కూడా హిట్‌ కొడతాడు’ అని తెలిపారు. ‘నాకు ఎప్పుడూ చాలా స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ చేయాలని ఉండేది. ఈ సినిమా వచ్చి నన్ను ఆశ్చర్యపరిచింది. సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ నేను చేయగలనా అని ఒక డౌట్‌ ఉంది. కానీ డైరెక్టర్‌ నాకు కాన్ఫిడెన్స్‌ ఇచ్చారు. రిస్క్‌ తీసుకుని ఈ సినిమా చేశాను. చాలా రియలిస్టిక్‌గా సినిమా ఉంటుంది’ అని హీరోయిన్‌ రుహాణి శర్మ అన్నారు. డైరెక్టర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ,’జనాలు థియేటర్‌కి వచ్చి చూడాలంటే ఏదో ఒక కొత్త విషయం ఉండాలి. 2 గంటలలోపు ఉన్న ఈ సినిమా మొదటి సీన్‌ నుంచి చివరి వరకు మిమ్మల్ని అలరిస్తుంది. థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడండి. ఈ సినిమా కోసం రుహాణి చాలా కష్టపడింది. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.’ అని చెప్పారు.ఎడిటర్‌ చాణక్య మాట్లాడుతూ,’సినిమాకి ఫస్ట్‌ ఆడియన్‌ ఎడిటర్‌. నేను ఈ సినిమాను చూశాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. థియేటర్లో చూశాక మీకు కూడా నచ్చుతుంది’ అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్‌ విష్ణు మాట్లాడుతూ, ‘ఇది మంచి సినిమా అవుతుంది. ఇప్పటికే టీజర్‌కి మంచి రీచ్‌ వచ్చింది. సినిమాకి కూడా చాలా రీచ్‌ వస్తుంది. నన్ను సినిమాటో గ్రాఫర్‌గా సెలెక్ట్‌ చేసుకు న్నందుకు చాలా థ్యాంక్స్‌’ అని తెలిపారు. ‘ఈ సినిమా సస్పెన్స్‌ స్టోరీ. హీరోయిన్‌ రుహాణి కెరీర్‌ ఆరంభంలోనే ఇలాంటి క్యారెక్టర్‌ చేయడం చాలా గొప్ప విషయం’ అని నటులు జీవన్‌, ప్రదీప్‌ అన్నారు.

Spread the love