సంతృపినిచ్చిన విజయం

హీరో శ్రీవిష్ణు, ‘వివాహ భోజనంబు’ ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సామజవరగమన’. అనిల్‌ సుంకర సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌ టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్‌ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాత అనిల్‌ సుంకర ఈ సినిమా సక్సెస్‌తో పాటు తమ నిర్మాణంలో రాబోతున్న సినిమాల విశేషాలను మీడియాతో షేర్‌ చేసుకున్నారు. ”సామజవరగమన’ విజయం పై ముందు నుంచి నమ్మకం ఉంది. చాలా మంచి స్క్రిప్ట్‌. ఈ స్క్రిప్ట్‌ని నా దగ్గరకి పంపించిన సందీప్‌కి థ్యాంక్స్‌ చెప్పాలి. కథ చెప్పినపుడే చాలా నచ్చింది. ఈ కథకు శ్రీ విష్ణు యాప్ట్‌. చాలా అద్భుతంగా నటించారు. చాలా ఇంప్రవైజ్‌ చేశాడు. ఇలాంటి కథ మరోసారి చేయాలంటే.. నా ఫస్ట్‌ ఛాయిస్‌ శ్రీవిష్ణునే. అలాగే నరేష్‌ పాత్ర కూడా హిలేరియస్‌. కథ చెప్పిన వెంటనే ఆ పాత్రకు నరేషే కరెక్ట్‌ అని భావించాం. ప్రీమియర్స్‌ ఈ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యాయి. ముందు రోజు నైజాంలో ఇరవై షోలు పడ్డాయి. పది లక్షల షేర్‌ వచ్చింది. ఈ సినిమా విజయం చాలా తప్తిని ఇచ్చింది. ఇదే కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా ఉంటుంది. అలాగే తమిళంలో రీమేక్‌ చేయాలనే ఆలోచన ఉంది. ‘భోళా శంకర్‌’ మంచి ఫ్యామిలీ మూవీ. చిరంజీవికి యాప్ట్‌ మూవీ. సినిమా పెద్ద విజయం సాధిస్తుందని చాలా నమ్మకంగా ఉన్నాం. ఆగస్ట్‌ 11న సినిమా రిలీజ్‌ అవుతుంది’ అని అనిల్‌ సుంకర అన్నారు.

Spread the love