మాఫియా అక్రమాలు

మాఫియా అక్రమాల నేపథ్యంలో ఎస్‌ ఎస్‌ మీడియా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రూపొందుతున్న కొత్త సినిమా ‘పరమపద సోపానం’. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్‌ అంబటి హీరోగా నటిస్తుండగా, జెన్నిఫర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మేకర్స్‌ ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు.
‘ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాల సర్పం కంట పడకుండా.. ఎగిరిపోవాలి అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో ఆసక్తికర ఎలిమెంట్స్‌ అందర్నీ అలరిస్తున్నాయి. సినిమా సోల్‌ తెలిసేలా కట్‌ చేసిన యాక్షన్‌ సన్నివేశాలు కథపై క్యూరియాసిటీ పెంచేలా చేశాయి. టీజర్‌లో వినిపించిన ఒకటి రెండు డైలాగ్స్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ హైలైట్‌ అయ్యాయి. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌, మాఫియా ప్రధానంగా ఈ మూవీ రూపొందుతోందని స్పష్టం చేస్తూ వదిలిన ఈ టీజర్‌ ప్రేక్షకుల దష్టిని విశేషంగా ఆకర్షించింది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం : నాగ శివ, ఎడిటర్‌ : గౌతమ్‌ రాజ్‌ నెరుసు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : గణపర్తి నారాయణ రావు, కో – ప్రొడ్యూసర్‌ : గుడిమిట్ల ఈశ్వర్‌.

Spread the love