పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక

అక్కడక్కడా తేలికపాటి నుం మోస్తరు వానలు పడొచ్చు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు పలు జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం , నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలున్నాయి. వడగాల్పులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. కొమ్రంభీమ్‌, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో వడగాల్పులు కూడా వీచాయి. ఉక్కపోత తీవ్రంగా ఉంది. వచ్చే ఐదురోజులకు గానూ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని సూచించింది.
గళవారం రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 70కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా కేంద్రంలో అత్యధికంగా 3.33 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. పది ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది.