నిమ్స్‌ డైరెక్టర్‌గా బీరప్ప

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిమ్స్‌ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌, డాక్టర్‌ బీరప్ప నగరి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌.ఏ.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అధిపతిగా కొనసాగుతున్నారు.