మోకాళ్లపై గుర్రపు బొమ్మైన నాన్న
నా సుఖ సంతోషాల కోసం
మరబొమ్మగా మారిన నాన్న
నా కన్నీటి వర్షానికి
గొడుగై అడ్డుకున్న నాన్న
దిగులు మొహంతో
మనసు ముక్కలైనపుడు
ఉబికే కంటిచెమ్మతో నాన్న
అనుభవం లోతుల్ని తడుముతూ
జీవిత పాఠాలని
అంచెలంచెలుగా నేర్పిన
ఉపాధ్యాయుడు నాన్న
అక్షరాల బడిలో
నా చిటికెన వేలు పట్టుకుని
చివరిదాకా నడిపించిన నాన్న
నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ
భవిష్యత్తులోకి ఒక్కొక్క అడుగేస్తుంటే
గెలుపోటముల రుచి సహజమేనని
కాలానికి కొత్తగా నన్ను పరిచయం చేసి
నాలో విజయస్ఫూర్తిని నింపిన నాన్న
ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోనూ
ఆశీస్సుల అక్షింతల కోసం
మీ ముందు వినయంతో మోకరిల్లుతూ
నిండు నూరేళ్ళూ మీరు ఆరోగ్యంగా వర్ధిల్లాలని ఆశిస్తూ…
– ఎన్.లహరి, 9885535506