తెలంగాణ సాధించిన మాకు తెలుసు
మహాత్ముని శక్తి అంబేద్కర్ యుక్తి!
విశ్వగురునకు తన మట్టి మీద మొలకెత్తిన
మహాత్ముని పరిచయం సినిమా చేసిందట!
అహింసను ఆయుధం చేసిన
ప్రపంచాన ఒకే ఒక్క మొనగాడు
ఉప్పును సైతం ఉద్యమం చేసిన యోధుడు
బాపూ! నీ చరిత్రను వెండి తెర విప్పడం బహు విచిత్రం!
సత్యం శాంతీ అహింసలు
తిరుగులేని ఆయుధాలని
లోకానికి చాటిన ఘనుడు
మిత్రో! ఈ మాటలు మీరైనా చెప్పండి!
కళ్ళు మూసుకున్న పిల్లి తీరు
మహాత్ముని మహత్మ్యం తెలియదంటూ
మీ డొల్ల తనం వెల్లడించాక
రాజ్యం భవిత భయపెడుతున్నది!
ధ్యానం ఉపవాసం ప్రదర్శన
వేషాలు వెకిలి చేష్టలు
మహాత్మునిగా నిలబెట్టలేవు
ఆచరణ శీలురను జ్ఞానులనే
చరిత్ర ఊరేగిస్తది!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261