కలివిడే దారి

ఎద్దులు విడిపోవడం
హద్దులు గీసుకోవడం
విడి విడిగా బతకడం
పడిపోయి ఏడ్వడం
దీర్ఘకాలం చెల్లింది

పులినోటబడి చావడం
ఉనికి ప్రశ్నార్థకమవడం
ఖర్మపై ప్రశ్న మొలవడం
పులి ఎత్తేనని తెలవడం
తోనే…తెలివిడి పెరిగింది
మళ్ళీ కలివిడి మిగిలింది

పులి రాజ్యమైన ఆ వేట
పులులకిక కష్టమైందట
ఎద్దుల శృంగారం ఆటకు
కొత్తగా ఆవుల తోలారట
అన్నీ ఒకటై నిలిచాయట

ఊపిరాడని పులులు మారి
ఎద్దులతో మాట కలిపాయి
ఇందులో మర్మం ఏంటంటూ
ఆవులెద్దులు చర్చ చేశాయి
విడదీసి పడగొట్టే పులులు
ఆటలిక చెల్లవని తేల్చాయి

ఆనాటి గుణపాఠం ఇప్పుడిక
మనిషికొక పాఠంగా మారింది
విడివిడి పోరాటాలు చాలవని
కలివిడి పోరుబాట పట్టారనేది
రైతు పోరుబాటలో తేటమైంది
రెజ్లర్ల తిరుగుబాటతో స్పష్టమైంది
– ఉన్నం వెంకటేశ్వర్లు