దివ్యాంగులకు ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

నవతెలంగాణ-ముషీరాబాద్‌
దివ్యాంగులకు పెన్షన్‌ రూ.3000 నుండిరూ.4 వేలకు పెం చడం గొప్ప నిర్ణయమని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ బోలక్‌పూర్‌ డివిజన్‌ అధ్య క్షులు వై.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరా భిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులకు మరింత ఆర్థిక భరోసా కల్పించారని కొనియాడారు. ప్రతి పక్ష పార్టీలు విమర్శలు చేయడం కాదు అభివద్ధిలో పోటీ పడాలన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ యువజన విభాగం నగర నాయకులు ముఠా జై సింహా, బోలక్‌ పూర్‌ డివిజన్‌ ఉపాధ్యక్షులు శంకర్‌ గౌడ్‌, మైనారిటీ విభాగం అధ్యక్షులు మక్బూల్‌, ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్‌ కుమార్‌, డివిజన్‌ మాజీ అధ్య క్షులు సయ్యద్‌ అహ్మద్‌ భక్తీర్‌, సీనియర్‌ నాయకులు మీడియా ఇన్ఛార్జి ముచ్చపర్తి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.