స్కూలుకు వేళాయరా!!!

నవతెలంగాణ-హైదారాబాద్ తెలంగాణ ప్రభుత్వం నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పునః ప్రారంభానికి బడిగంటలు అధికారికంగా మోగిం చిన సందర్భంగా తల్లిదండ్రులకు అవసరమైన కొన్ని ముఖ్య సూచనలను గురించి చర్చిద్దాం. ఈ సూచ నలను పిల్లల తో పాటింపజేయడం ద్వారా వారిలో క్రమశిక్షణ, స్కూల్‌ పట్ల ఆసక్తి, విద్యా భ్యాసం పట్ల అనురక్తి కలిగి విద్యా సంవత్సరాన్ని పూర్తిగా ప్రయో జన కారిగా మార్చుకోగలమని ఆశిద్దాం.
1) సమయపాలన
(టైం మేనేజ్మెంట్‌)
స్కూల్‌ షెడ్యూల్‌, టైం- టేబు ల్‌కు అనుగుణంగా పిల్లలు నిద్రపో వడం, మేలుకోవడం జరిగితే ఉత్సాహంగా స్కూలుకు హాజరై అన్ని క్లాసులు శ్రద్ధగా వింటారు. సగం సక్సెస్‌ ఇక్కడే ఉంది. అది మరవద్దు. టీవీ, మొబైల్‌, ఐపాడ్‌, ట్యాబ్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ల వాడకం తల్లి దండ్రుల నియంత్రణలో ఉండటం ఎంతైనా అవసరం.
2) క్రమశిక్షణ (డిసిప్లెయిన్‌)
స్కూల్లో టీచర్ల పట్ల, తోటి విద్యార్థుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల గౌరవభావంతో విద్యార్థులు మెలగాలి అంటే ముం దుగా తల్లిదండ్రుల పట్ల గౌరవం, భయం, భక్తి ఉండటం అత్యంత ఆవశ్యకం. స్కూల్లో విరామ సమ యాల్లో క్రమశిక్షణ పాటిం చాలి. తల్లిదండ్రులు పంపిన లంచ్‌ను పూర్తిగా తిని సకాలంలో తిరిగి పాఠ్యాంశాలను అభ్యసించడాఁకి సిద్ధమ వ్వాలి..ఇంటి వాతావరణంలో ఉపయోగించే భాషనే పిల్లలు నేర్చుకుంటారు, ప్రయోగిస్తారు. తల్లిదండ్రులు ఈ విషయంలో కొంత సమయమనం పాటించాలి..తస్మాత్‌ జాగ్రత్త !!! ముందు రోజు రాత్రి పిల్లలు తమ బ్యాగులను, లంచ్‌ బాక్స్‌లను.,వాటర్‌ బాటిల్స్‌ను ముఖ్యమైన పుస్తకాలను సిద్ధం చేసుకుని నిద్రకు ఉపక్రమించాలి. సమయం దొరికిన ప్పుడల్లా తల్లిదండ్రులు తమ పిల్లల బ్యాగులను పూర్తిగా పరిశీలించాలి. భవిష్యత్‌ పరిణామాలు తీవ్రంగా ఉండకుండా ఈ చిన్నవి పరిశీలన ఉపకరిస్తుంది.
3)క్రమం తప్పక అభ్యాసం (రెగ్యులర్‌ ప్రాక్టీస్‌)
స్కూల్లో బోధింపబడిన అన్ని సబ్జెక్టులకు పాఠ్యాంశాలలో ఇవ్వబడిన రైటింగ్‌ వర్క్‌ను, రీడింగ్‌ వర్క్‌ను క్రమం తప్ప కుండా ఇంటి వద్ద పిల్లలు అభ్యాసం చేసే విధంగా అలవాటు చేయాలి చదవడం, రాయడం ప్రతిరోజూ కొంతసేపైనా చేయాలి. ఎప్పటికప్పడు ఖచ్చితంగా పూర్తి చేయటం పిల్లల బాధ్యత అని తెలియజే యాలి. ఈ విష యంలో స్కూల్‌ అథారిటీస్‌ సహకారం తప్పకుండా తీసుకోవడం ఆవశ్యం.
4) టీచర్లతో
రెగ్యులర్‌ డిస్కషన్‌
ప్రతి చిన్న విషయాన్నీ, పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను, వారి బలాలను, బలహీనతలను, చదువుకు సంబంధించిన విషయాలతో పాటుగా వారి మానసిక పరివర్తన గురించి, శారీరక మార్పులు గురించి నిర్మొహమాటంగా టీచర్లతో రెగ్యులర్‌గా డిిస్కస్‌ చేసి వారి సహకారంతో పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి. తల్లిదండ్రులు ఉపా ధ్యాయులు చక్కటి అర్థవంతమైన సహకారంతో ఉన్నప్పుడే పిల్లలలో భయం,భక్తి కలిగి చదువు పట్ల ,సమాజం పట్ల క్రమ శిక్షణ అలవర్చుకోవటం సాధ్యమవుతుందని గుర్తించాలి.. ఉపాధ్యాయులకు , స్కూల్‌ యాజమాన్యాలకు పిల్లలను నియం త్రణలో ఉంచేందుకు అవసరమైతే పనిష్మెంట్‌ ఇచ్చేందుకు పూర్తి స్వేచ్ఛను తల్లిదండ్రులు కల్పించాలి.
5) మంచి అలవాట్లు- వ్యాపకాలు
మంచి పోషకాహారం, మితమైన శారీరక వ్యాయామం, ఆటలు- పాటలు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయి. పిల్లలకు ఇష్టమైన వ్యాపకాలను ప్రోత్సహించాలి. పుస్తక పఠనం, జనరల్‌ నాలెడ్జ్‌, ఇన్ఫర్మేషన్‌ షేరింగ్‌, ఆలోచనల మార్పిడి పట్ల ఎంకరేజ్‌ చేయాలి. టీవీలు ,మొబైల్‌ ఫోన్ల నుండి వీలైనంత ఎక్కువగా పిల్లలను దూరంగా ఉంచాలి. ప్రకతిని పరిశీలించడం, సమాజాన్ని అర్థం చేసుకోవడం, పెద్దల విలువ తెలియజేయడం, మానవ సంబంధాలు, నైతిక విలువలు, దేశ సభ్యత, సంస్కతి గురించిన విషయాలు కథల రూపంలో పిల్లలు నేర్చుకునే వాతావరణం కల్పించగలిగి నప్పుడు విద్యార్థులను భావితరాలకు ఉత్తమ పౌరులుగా అందించినవారమవుతాం.
సయ్యద్‌ ఖాసీం అలీ, ప్రిన్సిపల్‌
శ్రీ చైతన్య టెక్నో
స్కూల్‌, కర్మన్‌ ఘాట్‌
హైదరాబాద్‌- 9059022889