రాజగోపాల్‌నాయుడుకు ఘనసన్మానం

నవతెలంగాణ-అంబర్‌పేట
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స వాలను పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య దినోత్సవ సందర్భంగా హైద రాబాద్‌ కలెక్టరేట్‌ ఆధ్వర్యంలో నిర్వహి ంచిన కవి సమ్మేళన కార్యక్రమం సంజీవ రెడ్డినగర్‌లోని సీనియర్‌ సిటిజన్‌ కౌన్సిల్‌హాల్‌లో ఘనంగా నిర్వహిం చారు. ఈ కవి సమ్మేళనంలో అంబర్‌పేటకు చెందిన ప్రముఖ కవి, రచయిత, వక్త, సంఘసంస్కర్త, అన్న ఫౌండేషన్‌ అధ్యక్షుడు కొడవలి రాజ గోపాల్‌ నాయుడు తన కవితను చదివి వినిపించారు. అనంతరం నవభారత్‌ నిర్మాణ్‌ జనరల్‌ సెక్రటరీ రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కవి సమ్మేళనంలో భాను ప్రసాద్‌ డిస్టిక్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి చేతుల మీదుగా రాజగోపాల్‌ నాయు డుకి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి మెమెంటోను బహుకరించి పారితోష కాన్ని ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తెలుగు, హిందీ, ఉర్దూ కవులు పాల్గొన్నారు.