నవతెలంగాణ- జూబ్లీహిల్స్
రహమత్‌నగర్ డివిజన్ బూత్ కమిటీ సమావేశాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మె ల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో కలిసి ఎస్‌పీఆర్‌హిల్స్ క మ్యూని టీహాల్ ఏర్పాటు చేశారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియో జక వర్గంలో రహమత్ నగర్ డివిజన్ బీఆర్‌ఎస్‌కి ఎంతో బలమైన డివిజన్ అని, ఈ డివిజన్‌లో ఇతర పార్టీలకు నాయ కుల కూడా లేరని అన్నారు. అదేవిధంగా ప్రతి బూత్ కు 40 ఇండ్లు కేటాయిం చుకొని వారికి ఉన్న సమస్యలను తీసుకొని కార్పొరేటర్‌కు, నాకు తెలియపరచాలని ఎవరైనా డబల్ బెడ్ రూమ్‌కు అర్హులైన వారు ఉన్న, దళిత బంధు, బీసీబంధుకు అర్హులైన అర్జీలు చేస్తుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ ఫేస్ వన్ ప్రెసిడెంట్ అబ్దుల్‌సమద్, ఆర్.గాలి అన్న, ఫయాజ్ బీఆర్‌ఎస్ సీనియర్ లీడర్, వేముల యాదయ్య స్థానిక నాయకులు పాల్గొన్నారు.