నవతెలంగాణ-జవహర్నగర్
కుటుంబ కలహాలతో వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈసంఘటన జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం దమ్మాయి గూడలోని కొత్త భవానీనగర్ కాలనీలో ఆలకుంట్ల చంద్రయ్య కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుమారుడు ఆలకుంట్ల శ్రీకాంత్ భార్య పూజ మధ్య తరచూ గొడ వలు చోటుచేసుకునేవి. గతంలో కూడా శ్రీకాంత్ ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో భార్య పూజ పుట్టింటికి వెళ్ళగా, ఈ నెల 9న ఇంట్లో చెప్పకుండా శ్రీకాంత్ బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకి కోసం చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికిన సమా చారం లభించలేదు. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.