నవతెలంగాణ-కాప్రా
ప్రజా సమస్యల పరిష్కారానికై సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెం జిల్లా లోని ప్రకాశం స్టేడియంలో సీపీఐ ప్రజా గర్జన బహిరంగ సభకు సీపీఐ ఉప్పల్ మండల సమితి ఆధ్వర్యంలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. శంకర్ రావు మాట్లాడుతూ గత నెలలో చేపట్టిన ఇంటింటికీ సీపీఐ కార్యక్రమ ముగింపులో భాగంగా లక్ష మంది ఎర్ర దండుతో కొత్తగూడెంలో సభ జరిగినట్టు వారు తెలిపారు. ఓట్లు,సీట్లు ప్రామాణికం కాకుండా కేవలం ప్రజా సమస్యల పరిష్కారమే ధేయంగా సీపీఐ అహర్నిశలు ప్రజల పక్షాన రాజీలేని పోరు కొనసాగిస్తున్నదనిస్పష్టంచేశారు.ఈ సభకు వెళ్లిన వారిలో ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి జయచంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్, సీపీఐ ఉప్పల్ మండల కార్యదర్శి పి. రామ్ నారాయణ, సీపీఐ ఘట్కేసర్ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, సీపీఐ కాప్రా పట్టణ కార్యదర్శి లక్ష్మీ నారాయణ, మండల కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి కష్ణ, భిక్షపతి, స్వామి దాస్,మిరియాల సాయిలు, నర్సింగ్ రావు, శివ,ఉష, నాగమణి, ఏఐఎస్ ఎఫ్ మండల అధ్యక్షుడు అజీమ్ పాషా తదితరులు పాల్గొన్నారు.