స్వరాష్ట్రంలో సుపరిపాలన : మేయర్‌ వెంకట్‌రెడ్డి

నవతెలంగాణ-బోడుప్పల్‌
తెలంగాణలో తలెత్తుకుని స్వరాష్ట్రంలో సుపరిపాలన సాగించడం ఆనందంగా ఉందని పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మేయర్‌ జక్క వెంకట్‌ రెడ్డి, కమిషనర్‌ వంశీ కష్ణ ఆధ్వర్యంలో ‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో చేపట్టిన పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రజలకు వివరించారు. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివత్తంగా పనిచేస్తే.. ఏ ప్రభుత్వమైనా ప్రజల ప్రశంసలు పొందుతుందని సీఎం కేసీఆర్‌ భావిస్తారన్నారు. దేశంలో మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 30% జాతీయ అవార్డులను గెలుచుకుంటుందన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌-బీపాస్‌ విధానాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిందని..ఈ విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతులకు 21 రోజుల్లో సింగిల్‌ విండో అనుమతి అందజేయబడుతుందన్నారు. దీనిద్వారా ప్రజలు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే అనుమతులు సాధించుకోవచ్చు అని వివరించారు. సుపరిపాలనలో ఇదొక గొప్ప సంస్కరణ అని కొనియాడారు. భూ కబ్జాలను అరికట్టెందుకు ‘ధరణి’ వంటి ఆధునిక పద్ధతులను అవలంబించి భూ హక్కులను కల్పించడం జరిగిందని అన్నారు, ఇంకా ఇలాంటి ఎన్నో పరిపాలన సంస్కరణలతో స్వపరిపాలనో రాష్ట్రం అన్ని రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అనడంలో అతియోశక్తి లేదన్నారు. అనంతరం వివిధ శాఖల విద్యుత్‌, పోలీస్‌, జలమండలి, రెవిన్యూ, మున్సిపల్‌ అధికారులతో పాటు పాలకమండలి సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.ి్డ