పార్కుల సుందరీకరణకు కృషి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌

నవతెలంగాణ-అంబర్‌పేట
పార్కులో సుందరీకరణ దిశగా నిరంతర కృషి చేస్తున్నానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. సోమవారం గోల్నాక డివిజన పరిధిలోని కష్ణా నగర్‌లో పార్కు సుందరీకరణ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే తోపాటు గోల్నాక కార్పొరేటర్‌ దూసరి లావణ్య శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులో ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా వివిధ రకాల మొక్కలు నాటడం, వాకింగ్‌ ట్రాక్‌, నీటి సౌకర్యం, కొత్త బెంచీలు, పెయింటింగ్‌, టైల్స్‌ వేయడం, పిల్లలకు క్రీడా సాధనాలు వంటి వాటితో పాటు విద్యుత్‌ దీపాలు, పటిష్టమైన ఆర్చ్‌, గేటు, పార్కు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించనున్నామన్నారు. స్థానిక యువత కోసం ఇక్కడ ఓపెన్‌ జిమ్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు అర్‌.కే.బాబు పల్లవి, ఉమాదేవి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.