గల్ఫ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

ఈటెల రాజేందర్‌
నవతెలంగాణ-ముషీరాబాద్‌
బహుగోలిక తెలంగాణ వచ్చిందే కానీ బడుగుల తెలంగాణ రాలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. గల్ఫ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమ ర్శించారు. మంగళ వారం సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో గల్ఫ్‌ కార్మికులకు సామాజిక బాధ్య త. ప్రభుత్వాల పాత్ర అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతి ధిగా పాల్గొన్న ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గల్ఫ్‌ కార్మికుల సమస్యలను స్వయంగా అక్కడకు వెళ్లి చూశానని, రాష్ట్రం వచ్చిన తరువాత నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం కేరళ మోడల్‌ స్టడీ చేశామని దాన్ని అడాప్ట్‌ చేసుకోవాలని సూచించామ న్నారు. ఆరు నెలలకు ఒకసారి కార్మికులు వచ్చేపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అందుకు రవాణా కూడా ప్రభుత్వమే భరించాలని అన్నారు. కార్మికులు చనిపోతే 25 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లిం చాలని, ఐదేళ్లు గల్ఫ్‌లో పని చేసి తిరిగి వచ్చిన వారికి బ్యాంకు రుణాలు ఇప్పించి ఆదుకునే విధంగా ప్రభు త్వం కషి చేయాలని అన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్ర కుమార్‌ మాట్లాడుతూ రాజ్యం ప్రజలకు జీవించే హక్కులను కల్పించిందని అన్నారు. ఎంతో ప్రకతి సంపద కలిగిన భారతదేశం లో వలసలు కొనసాగడం అత్యంత బాధాకరమన్నారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కషి చేయా లని సూచించారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్‌ జేఏసీ చైర్మెన్‌ గుగ్గిళ్ల రవిగౌడ్‌, ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల స్వదేశ్‌, తెలంగాణ గల్ఫ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సింగిరెడ్డి నరేందర్రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ సుధాకర్‌, మాజీ జెడ్పీటీసీ చైర్మన్‌ తుల ఉమా పాల్గొన్నారు.