పలు జిల్లాలకు వేడిగాలుల హెచ్చరిక

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వచ్చే రెండు రోజులకు సంబంధించి పలు జిల్లాల్లో వేడిగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ జాబితాలో నల్లగొం, ఖమ్మం, ఆదిలాబాద్‌, ములుగు, కొమరంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ జిల్ల్లాలున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని తెలిపింది.