కాటాపూర్ లో తీరనున్న పేదల సొంతింటి కల..

– ఇళ్ళ పట్టాల పంపిణీకి రంగం సిద్ధం
– మొత్తం 204 అప్లికేషన్స్..
– 105 లబ్ధిదారుల ఎంపిక
– తాసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ గ్రామంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర నుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక తాసిల్దార్ ముల్కలు శ్రీనివాస్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ లు స్థానిక సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి, గ్రామ సభలో అందరి సమక్షంలో లబ్ధిదారులను సెలెక్ట్ చేశారు. మొత్తం 204 అప్లికేషన్స్ రాగా, ఫైనల్ గా అర్హులైన 105 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ మాట్లాడుతూ వీటన్నిటిని కలెక్టర్ అప్రూవల్ కొరకు పంపించనున్నట్లు తెలిపారు. వారం రోజుల అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రజా ప్రతినిధులు అధికారుల సహాయ సహకారాలతో వారం రోజుల తర్వాత పేదలకు ఇట్టి స్థలాల పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ, ఉప సర్పంచ్ మేడిశెట్టి పుష్ప, స్థానిక ఎంపిటిసి మేడిశెట్టి జయమ్మ, మండల కోపరేషన్ మెంబర్ దిలావర్ ఖాన్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు దుగ్గి చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి భాగ్యరాణి, వార్డు మెంబర్లు, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, దిడ్డి మోహన్ రావు, మాజీ సర్పంచ్ ముజఫర్ హుస్సేన్, నాయకులు సయ్యద్ హుస్సేన్, రంగు సత్యనారాయణ, బందెల తిరుపతి, ముత్తినేని లక్ష్మయ్య,దానక నర్సింగరావు, మహిళ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.