– ముడు ఇళ్ళల్లో దోంగతనం..
నవతెలంగాణ – డిచ్ పల్లి.
|ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో దొంగల ముఠా గ్రామంలో మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన జక్కుల లక్ష్మి, బోగం లక్ష్మి, బోగం బాలమణి నివాస ఇండ్లకు ఉన్న 3 తాళాలను పగలగొట్టి బీరువాలోని నగదు, బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. రోజువారి మాదిరిగానే జక్కుల 3 లక్ష్మి భోజన కార్యక్రమం ముగించుకొని 9గంటల సమయంలో బంగ్లపై నిద్రిస్తుండగా దొంగలు తాళాలు పగలగొట్టి తులంన్నర కమ్మలు, ముక్కుపోగు, మూడు జతల పట్టగొలుసులు, 80వేల నగదు, బ్యాంకు పత్రాలు ఎత్తుకెళ్లారు. లక్ష్మి ఇంటి పక్కనే ఉన్న బోగం లక్ష్మి నివాసం తాళాలు పగలగొట్టి బీరువాలోని అరతులం బుట్టల కమ్మలు, 50వేల నగదు, బంగారు చైను, ఉంగరం, ముక్కుపోగు, బ్రాస్లెట్ ఎత్తుకెళ్లారు. బోగం బాలమణి నివాసం తాళాలు పగలగొట్టి 20వేల నగదు ఎత్తుకెళ్లి పరారయ్యారు. తెల్లవారు జామున జక్కు లక్ష్మి బంగ్ల దిగి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాని చూసి లబోదిబోమని రోధించారు. విషయాన్ని ఇందల్ వాయి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం 3గంటల సమయంలో జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలో దొంగల ఆచూకి ఏమైనా ఆధారం లభిస్తుందా అని సీసీ పుటేజీలను పరిశీలించారు. లక్ష్మి నివాసం దగ్గరలో “ఉన్న సీసీ కెమెరా గత కొద్దిరోజులుగా పనిచేయడం లేదని తెలిసింది.