బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఫ్యాక్స్‌ ఛైర్మన్‌

నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రానికి చెందిన మొగురం మల్లయ్య ఇటీవల మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను శనివారం ఫ్యాక్స్‌ ఛైర్మన్‌ పెర్యాల దేవెందర్‌రావు పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని తమప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తిప్పారపు నాగరాజు, ఉల్లెంగల లింగాచారి, ఎత్తి పద్మయ్య, తలారి నర్సయ్య, ఆరె జగదీష్‌, తంబటి నర్సయ్య, సుశీల, కనకలక్ష్మి, రాజవ్వ, కుటుంబ సభ్యులు మొగురం వెంకటస్వామి, మొగురం నర్సయ్య, మొగురం శంకర్‌, తదితరులు ఉన్నారు.