మల్కపేట జలాశయం రెండో పంపు ట్రయల్ రన్ సక్సెస్


నవతెలంగాణ – హైదరాబాద్

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట రిజర్వాయర్‌లోకి నిర్వహించిన ఎత్తిపోతల ట్రయల్‌ విజయవంతమైంది. ఇప్పటికే ఒక పంపును విజయవంతంగా పరీక్షించగా, రెండో పంపును గంటపాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఆదివారం వేకువజామున 12.40 నుంచి 1.40 గంట వరకు రెండో పంపు ద్వారా ట్రయల్‌ రన్‌ కొనసాగింది. గత 23న మొదటి పంపు ట్రయల్‌ రన్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో పంపు ట్రయల్ రన్ కూడా సక్సెస్ అవ్వడంతో మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తంచేశారు.