జీజీహెచ్ లో డైట్ సప్లై చేసిన గంగాధర్ పై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
జీజీహెచ్ లో డైట్ సప్లై చేసిన గంగాధర్ పై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయగలరు అని వై.శ్రీనివాస్ కలెక్టర్ ని కోరారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) లో డైట్ సప్లై చేసే జీ.గంగాధర్ జీజీహెచ్ లో డైట్ సప్లై వై.శ్రీనివాస్ అనుభవం, ఆధారాల తో క్లెయిమ్ చేస్తున్నారు అని అన్నారు. శ్రీనివాస్ యెద్గల సంస్థ ను  మెసర్స్ వై.శ్రీనివాస్ దాని వాస్తవ యజమాని గా 2009 సంవత్సరం నుండి నేనే యాజమాన్య సంస్థను నడీపిన్నాను అని, నా ఉద్యోగిలో ఒకరైన జీ.గంగాధర్ నా పేరు పేరుతో కొత్త సంస్థను తెరిచారు అని,  శ్రీనివాస్, భాగస్వామ్య సంస్థగా కొత్త పాన్ కార్డ్, జీఎస్టీ, ఇతర ఆధారాల కోసం దరఖాస్తు చేసుకున్నారు అని, నా అనుభవాన్ని చట్టవిరుద్ధంగా అతనిదిగా పేర్కొంటున్నారు అని అన్నారు. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి నాకు న్యాయం చేయాలని కోరారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ వివరాలలో భాగస్వామ్య సంస్థగా చూపుతున్నప్పుడు జీ గంగాధర్ ఇన్‌వాయిస్‌ (బిల్లు) ను యజమానిగా సమర్పించినట్లు కలెక్టర్ కు దృష్టికి తీసుకువెళ్లానాని అన్నారు. కలెక్టర్ కు అర్టీఐ దరఖాస్తులు, ప్రజావాణి అక్నాలెడ్జ్‌మెంట్ రసీదు లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జి.గంగాధర్‌కు ఇచ్చిన లీగల్ నోటీసు కూడా కలెక్టర్ కు అందజేశామని అన్నారు. వీటి పైన విచారణ చేసి జీ.గంగాధర్ పై కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరారు.