
నవతెలంగాణ- కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచస్థాయి సాంకేతికతతో, అబ్బురపరిచే పరిజ్ఞానంతో టూరిస్ట్ హబ్ గా కరీంనగర్ జిల్లా కేంద్రం లోని మానేరు నదిపై నిర్మించిన
కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 21 న రాష్ట్ర ఐటి పురపాలక శాఖమాత్యులు కేటి రామారావు ప్రారంభించనున్నారు. కరీంనగర్ పట్టణంలోని వి కన్వేన్షన్ హాల్ లో కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభ వేడుకలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. డైనమిక్ లైట్లను ప్రారంభించి, అనంతరం మానేరు రివర్ ఫ్రంట్ ను వీక్షించి, సాంస్కృతిక కార్యక్రమాల తరువాత సభ ఉద్దేశించి మాట్లాడుతారని తెలిపారు. దేశంలో మొట్టమొదటి సారిగా కేబుల్ బ్రిడ్జిపై 30X10 సైజులో స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 22 న కూడ కేబుల్ బ్రిడ్జి వద్ద సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని మంత్రి తెలిపారు.ఈ నెల 21,22 తేదీల్లో ప్రజలందరూ పాల్గొనలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, కేబుల్ బ్రిడ్జికరీంనగర్ కు ఓ ఐకాన్ గా నిలువనుందని, ఇంతఅద్బుతమైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కృషిచేసిన అధికారులు కష్టపడి పనిచేశారని వారందరికి కృతజ్ఞతలను తెలియజేశారు. సిపి సుబ్బారాయుడు మాట్లాడుతూ, ప్రపంచస్థాయి ప్రమాణాలతొ కేబుల్ బ్రిడ్జిని రూపొందించడం జరిగిందని, హైదరాబాద్ నగరంలోని నక్లెస్ రోడ్డు, పార్కులను అద్బుతంగా చూపిస్తారని, కరీంనగర్ లో నిర్మితమైన కేబుల్ బ్రిడ్జి వాటిని మించిన స్థాయిలో నిలిచిందని తెలిపారు.