ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో మేటి.. నిరంతరం ప్రజా సేవ చేయడంలో ఘనాపాటి.. అందరివాడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రజా సేవలో నిమగ్నమై అందరికీ ఆపద్బాంధవుడులా నిలుస్తున్నారు ఎస్ఆర్ఆర్ సంస్థల అధినేత శ్రీనివాస్ రెడ్డి. బుధవారం మండలంలోని గట్టికల్ గ్రామ శివారులోని సవారు లచ్చమ్మ గుడికి 30 వేల రూపాయలను విరాళంగా అందజేసి గుడిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. తదుపరి రాగన్నగూడెం, తిర్మలాయపల్లి గ్రామాల్లో బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందచేశారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..సొంత మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడంలో ఎనలేని తృప్తి కలుగుతుంది అన్నారు. ఆపత్కాల సమయంలో ఎవ్వరు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల సమస్య ఏదైనా పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఇకముందు కూడా నిర్విరామంగా సేవ కార్యకర్తలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లేతకుల మహేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కోల సంపత్, గోవర్ధన్ రెడ్డి, సామాజిక కార్యకర్త కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు, గ్రామస్తులు లతదితరులు పాల్గొన్నారు.