నవతెలంగాణ – గోవిందరావుపేట
హెచ్ఐవి ఎయిడ్స్ అంటూ వ్యాధులు కావని అంటించుకునే వ్యాధులని వై ఆర్ జి కెర్ సంస్థ లింక్ వర్కర్ టి కిషన్ అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో దుంపెల్లి గూడెం గ్రామంలో జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాల లో 8 9 10 క్లాస్ పిల్లలకి హెచ్ఐవి ఎయిడ్స్ మీద వై ఆర్ జి కేర్ సంస్థ లింక్ వర్కర్ కిషన్ అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. హెచ్ఐవి ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అని చెప్పారు హెచ్ఐవి నాలుగు మార్గాల ద్వారానే వస్తుంది అవి 1) సురక్షితం కాని లైంగిక సంబంధాల వల్ల 2) కలుషితమైన సోదులు ఇంజక్షన్లు బ్లేడ్ ద్వారా 3) పరీక్షించిన రక్త మార్పిడి ద్వారా 4) హెచ్ఐవి తల్లి నుండి పుట్టబోయే బిడ్డకి ఈ నాలుగు మార్గాల ద్వారానే వస్తుంది అని చెప్పడం జరిగింది అపోహల గురించి చెప్పడం జరిగింది వారిని ముట్టుకున్న వారు ధరించిన దుస్తులు వాడిన వారిని కౌగిలించుకున్న వారిని ముద్దు పెట్టుకున్న హెచ్ఐవి రాదు కేవలం నాలుగు మార్గాల ద్వారానే వస్తుంది అని వివరించి చెప్పారు. హెచ్ఐవి పేషెంట్ ని ప్రేమతో ఆదరిద్దాం వారిని వివక్షత చూపకూడదు వివక్షత చూపితే గవర్నమెంట్ జీవో ప్రకారం వారికి ఐదు వేల రూపాయల జరిమానా పడుతుంది మరియు మూడు సంవత్సరాల వరకు బెయిల్ దొరకదు అని చెప్పారు హెచ్ఐవి పేషంట్లకి ఏ ఆర్ టి అనే మందులు ఉన్నాయి అన్నారు.