సిర్నపల్లి సబ్ స్టేషన్ వద్ద రైతుల నిరసన..

– సమస్యను పరిష్కరిస్తున్నం..
నవతెలంగాణ డిచ్ పల్లి.
ఇందల్ వాయి మండలంలోని మేఘ్య నాయక్ తండా కి చెందిన రైతులు బుధవారం ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి టీజీ ఎన్ పి డి సి ఎల్ సబ్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇందల్ వాయి మండలంలోని మేగ్యనాయక్ తాండ కు చెందిన రైతుల భూములు గన్నారం పరిధిలో ఉన్నాయని, వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లు సిర్నాపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఉన్నాయని, గత వారం రోజులుగా విద్యుత్ సమస్యతో సతమత మవుతున్న మని పలు మార్లు విన్నవించిన మీ సమస్యను
ఎవరు పరిష్కరించాలో తేలియక ఇబ్బందులు పడుతున్నామని వారన్నారు.గత వారం రోజులుగా ఎవరు స్పందించడం లేదని దింతో విసుగు చెంది సబ్ స్టేషన్ కి వచ్చి నిరసన తెలుపుతున్నామన్నారు. ఇప్పటికైన విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నాట్లు వారన్నారు.
 దృష్టికి వచ్చిన వెంటనే సమస్య వచ్చింది..
సిబ్బంది తో పనులు చేయిస్తున్న..
ఏఈ జ్ఞానేశ్..
 మేఘ్య నాయక్ తండాలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫారం కు సంబంధించిన విషయం ఈ రోజే నా దృష్టికి వచ్చిందని వ్యవసాయ భూమి గన్నారం పరిధిలో ఉండగా సంస్థాన్ చిన్నపల్లి సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అవుతుందని వారు వివరిస్తున్నట్లు ఇందల్ వాయి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి టి జి ఎన్ పి డి సి ఎల్ ఏ జ్ఞానేశ్  నవ తెలంగాణకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్య ఇతర ద్వారా మంగళవారం సాయంత్రమే తన దృష్టికి వచ్చిందని వెంటనే ఆ రైతులతో సిబ్బందితో మాట్లాడడం జరిగిందని ఏది వచ్చిన సమస్యను పరిష్కరించే బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపైనే ఉంది కాబట్టి గన్నారం సబ్స్టేషన్, సిర్న పల్లి సబ్స్టేషన్ ఏ పరిధిలోకి వస్తుందో తెలియకనే ఒకరోజు ఆలస్యమైందని అయినా బుధవారం సాయంత్రం విద్యుత్ శాఖ సిబ్బందికి ట్రాన్స్ఫార్మర్ వద్ద పంపించి దాన్ని మరమ్మతులు చేయించడం జరిగిందని రైతులు ప్రతి చిన్నదానికి పెద్దది చేయకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ దృష్టికి తీసుకొని వచ్చి సమస్యని పరిష్కరించుకోవాలని కోరారు.