అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం..

-గోషామహల్ నియోజకవర్గం సిఐటియు నాయకులు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
మహబూబాబాద్ లో  ప్రభుత్వ భూమి లో  గుడిసెలు వేసుకొని ఇండ్ల స్థలాల  కోసం పోరాటం చేస్తున్న  పేద ప్రజల పై  పోలీసులు లాఠి చార్జీ చేశారు. ఆ  లాఠీ చార్జీలో గాయపడిన  ప్రజలను  పరామర్శించడానికి వెళ్లిన  ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు  టి.సాగర్ , ఎన్.శ్రీరాం నాయక్ లను అరెస్టు చేశారు.ఆ అక్రమ  అరెస్టులకు ఖండిస్తున్నాం ,  రంగారెడ్డి జిల్లా సాహెబ్ నగర్ లో  ప్రభుత్వ స్థలంలో గుడిసెలు  వేసుకున్న పేదప్రజల పై పోలీసులు లాఠి చార్జీ చేసి గాయాల  పాలు చేసినారు. పోలీసులు చేసిన లాఠి చార్జీలను  నిరసిస్తూ ,రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని  ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగ  ప్రజా సంఘాల పోరాట వేదిక  గోషామహల్ జోన్  కమిటీ ఆధ్వర్యంలో గోల్ మసీదు  చౌరస్తాలో నిరసన కార్యక్రమం  నిర్వహించారు. ఇండ్లు లేని పేదప్రజల కు ఇండ్లు ఇవ్వాలని , ఇండ్లు , ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకు  పోరాడుతామని , నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జోన్ కన్వీనర్ , కో కన్వీనర్ ,పి.నాగేశ్వర్ , కె.జంగయ్య  , జోన్ నాయకులు నెమ్మది కిరణ్ , జి.గంగపురి , బిక్షపతి , నాంమ్ దేవ్ , నెమ్మది శ్రీను , కాలాప్ప , బాబు రావు , తదితరులు పాల్గొన్నారు