వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి మహాభిషేకం, శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు చేశారు. ఆదివారం ఉదయం నాగిరెడ్డి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్ద పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు ,ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వినోద్ రెడ్డి నమిలకొండ ఉమేష్ శర్మ, ఏ.ఈ.ఓ. శ్రీనివాస్, సూపర్డెంట్ తిరుపతిరావు, రాజేందర్, ఆలయ అర్చకుల తోపాటుగా రాజన్న జిల్లా భాజపా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు. విగ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద సేవపై వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి, పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించిన ఆలయ ధర్మగుండంలో నిమజ్జనం చేశారు.