యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి..

– ఎఐఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీల ఇంచార్జ్ రెహమాన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో గత రెండు నెలలుగా నెలకొన్న అనిశ్ఛిత పరిస్థితుల నేపథ్యంలో, యూనివర్సిటీ ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ఎఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల ఇంచార్జ్ రెహమాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బుధవారం ఎఐఎస్ఎఫ్ బృందం యూనివర్సిటీని సందర్శించింది. వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన విద్యార్థులను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరిని కలిసి యూనివర్సిటీ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల ఇంచార్జ్ రెహమాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘురాం, జిల్లా అధ్యక్షులు అంజలిలు మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా తెలంగాణ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ను నియమించాలని, గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షించాలని, యూనివర్సిటీ అధ్యాపకులను గ్రూప్ లుగా విభజించి, తగాదాలను ప్రోత్సహిస్తున్న నవీన్ మిట్టల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే యూనివర్సిటీలో విద్యార్ధినిలకు సరైన హాస్టల్ సదుపాయం లేదని, నూతన హాస్టల్ భవనాలను నిర్మించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి కోరారు. యూనివర్సిటీ లో ఖాళీగా వున్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేవిధంగా చుడాలని వారన్నారు. ఈ కార్యక్రమంలోకుషాల్ దేవ్, వంశీ, తరుణ్, ఖలీల్, విష్ణు వర్ధన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.