
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర హాస్టల్లోని సమస్యలు పరిష్కరించాలని పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించరు. ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టల్లు అన్నీ కూడా కొత్త పుంతలు తొక్కుతాయనీ, హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మొక్కుబడిగా అద్దె భవనాలలో రెసిడెన్షియల్ హాస్టల్ లను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇలా అద్దె భవనాలలో కొనసాగుతున్నటువంటి హాస్టల్లో ఒకటి బీబీపేట మండల కేంద్రంలో ఉన్నదన్నారు. ఇందులో 250 కెపాసిటీ ఉన్నటువంటి అద్దె భవనంలో నాలుగు వందల 30 మంది విద్యార్థులు ఉంటున్నారన్నారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకుండా, మరుగుదొడ్లు లేకుండా, వాటికి సరైన డోర్స్ లేకుండా కిటికీలకు సైతం డోర్స్ లేకుండా ఉండడం వలన వర్షం పడినప్పుడల్లా కిటికీలో నుంచి వర్షం నీరు తరగతి గదులలోకి రావడం వలన ఆ వర్షానికి బట్టలు తడిసిపోవడం, విద్యార్థులు రాత్రులు నిద్ర లేకుండా మేలుకొని కూర్చోవడం ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని, మా పిల్లలు మాకు ఫోన్ చేసి చెప్పడం వలన మేము స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు, ఆర్ సి ఓ కు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఆ పిల్లల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అందుకోసమని మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని విద్యార్థుల సమస్యల నుంచి బయటపడాలని దీనికి కొత్త భవనమే సరైన మార్గం అందుకోసమని కొత్త భవనంలోకి విద్యార్థులు మారితే వారికి సరిపడా తరగతి గదులు నిద్రపోవడానికి ఉండవలసిన గదులు పాఠశాలకు ఉండాల్సిన క్రీడా ప్రాంగణం అన్నీ ఉంటాయనీ, మా పిల్లలు అన్నింటిలో రాణిస్తారు అని తల్లిదండ్రులు గా మేము కోరుకుంటాము అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అద్దె భవనంలో కనీసం క్రీడా ప్రాంగణం లేదు, పిల్లలకు కావలసినటువంటి పాఠశాలకు సంబంధించిన వసతులు సైతం ప్రాంగణంలో కనిపించడం లేదన్నారు. అందుకని కొత్త భవనానికి మార్చి మా పిల్లలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అన్నారు. లేకపోతే మేము మా పిల్లలు అందరం కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట బయట నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు 50 మందికి పైగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్నారు.