ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి 

If there are any objections in the voter list should be informed– ఎంపీడీఓ సుమన వాణి 
– గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా 
నవతెలంగాణ – తాడ్వాయి 
గ్రామపంచాయతీ ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయం ఎంపీడీవో సుమన వాణి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎంపీడీవో సుమన వాణి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శాసనసభ ఎన్నికల ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని గ్రామపంచాయతీ ఓటరు జాబితా ప్రకటించిన్నట్లు తెలిపారు. అందులో ఏమైనా ఆబ్జెక్షన్స్, తప్పులు దొర్లినట్లయితే 21 వ తారీకు లోగా మండల కార్యాలయంలో గాని, దగ్గర్లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.మండలంలోని 18 గ్రామ పంచాయతీల లో 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు తమ ఓటు లేదని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిందని, ఒక వార్డు నుంచి మరొక వార్డు మారిందని, ఓటరు జాబితాలో తప్పులు ఉన్నాయని ఆందోళన పడకుండా ముందుగానే తమ ఓటును పరిశీలించుకుని, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆమె తెలిపారు.ఈనెల 26 తుది నివేదిక సమర్పిస్తామన్నారు. సెప్టెంబర్ 28 తేదీన ఓటరు జాబితా విడుదల చూస్తామని తరువాత ఎలాంటి మార్పులు, చేర్పులోకి అవకాశం ఉండదని పేర్కొన్నారు. మండల ప్రజలు ఇటి ఓటరు జాబితా పై అభ్యంతరాలు తెలియజేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ జాల శ్రీధర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరరావు, పిఎసిఎస్ డైరెక్టర్ యానాల సిద్ధి రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దండుగుల మల్లయ్య, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, ఎండి రఫీక్, సిపిఎం నాయకులు దుగ్గి చిరంజీవి, దాసరి కృష్ణ, బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్ల పెళ్లి లక్ష్మణ్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు కోరిక వెంకట్రాం, ఆలం శ్రీను, ఆలకుంట సాంబశివరావు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.