నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్ పుర్ గ్రామంలోని ఇస్లాం పుర మస్జిద్ లో ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని మస్జిద్ లో ప్రత్యేక నమాజ్, ప్రార్థనలు చేసిన రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాస్ జిద్ కమిటీ సభ్యులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. త్వరలో సమస్యలో పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పిటిసి దాసరి ఇంద్రా లక్ష్మీ నరసయ్య , మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీల పోరాం అధ్యక్షులు దండు గుల సాయిలు, కో ఆప్షన్ సభ్యులు షేక్ నయీమ్, ఖుర్షీద్, షేక్ నయీమ్, మోహమ్మద్ యూసఫ్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి , సీనియర్ నాయకులు శక్కరి కోండ కృష్ణ, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఘనంగా సన్మానించారు.