25న ఎస్సీ వర్గీకరణ సాధన సదస్సును విజయవంతం చేయాలి

– ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీ లింగంపల్లి శ్రీనివాస్ పిలుపు
నవతెలంగాణ-బెజ్జంకి
ఈ నెల 25న సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఎస్సీ వర్గీకరణ సాధన జిల్లా సదస్సును విజయవంతం చేయాలని ఎంఎస్పీ జిల్లా ఇంచార్జీ లింగంపల్లి శ్రీనివాస్ ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ నాయకులతో శ్రీనివాస్ జిల్లా సదస్సు సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ హజరవుతున్న దృష్ట్యా మండలంలోని అయా గ్రామాల అనగారిన వర్గాల యువత,మేదావులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో హజరవ్వాలని శ్రీనివాస్ కోరారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు సామ్రాట్ ప్రకాశ్, సుంకు రమేశ్, మాతంగి జితేందర్, చింతకింది పర్శరాం, బోనగిరి అంతయ్య, లింగం తదితరులు పాల్గొన్నారు.