ఒఎల్‌ఎక్స్‌లో 800 మందికి ఉద్వాసన

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ ఒఎల్‌ఎక్స్‌ గ్రూప్‌ భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి సిద్దమయ్యింది. దాదాపు 800 మంది సిబ్బందిని ఇంటికి పంపించనున్నట్లు ప్రకటించింది. ఆటోమోటివ్‌ బిజినెస్‌ యూనిట్‌ ఒఎల్‌ఎక్స్‌ ఆటోస్‌ కొన్ని ప్రాంతాల్లో ఒడిదుడుకులతో నడుస్తుండటంతో కంపెనీ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 1500 మంది ఉద్యోగులను తొలగిస్తుందనే అంచనాల మధ్య తాజా నిర్ణయం వెలుపడింది. ఒఎల్‌ఎక్స్‌ గ్రూప్‌లో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 11,375 మంది పని చేస్తున్నారు. ఉద్వాసనకు గురైన వారికి అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది.