శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి!

– నేడు ప్రకటించే అవకాశం
–  బీఆర్‌ఎస్‌ అధిష్టానం పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గురువారం సీఎం కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఆమెకు ప్రత్యే క వెహికిల్‌, పీఏ, గన్‌మెన్‌ను కేటాయించింది. అందు లో భాగంగానే ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌ కు రావాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం కబురు పంపింది. గురువారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసి అమరవీరుల స్తూపం ఆవిష్కరణ సభలో ఆమె పాల్గొనే అవకాశముంది. ఆ వేదిక మీదుగానే ఆమెను ఎమ్మెల్సీగా ప్రకటించే సూచనలున్నాయి.

Spread the love