అమరవీరుల త్యాగాలు ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

నవతెలంగాణ- వీణవంక
అమరవీరుల త్యాగాలు ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని ఎంపీపీ రేణుక అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం లో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వీణవంక మండల పరిషత్ కార్యాలయంలో అమరవీరులకు నివాళులు అర్పించిన ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి, అధికారులు అమరవీరులకు మరణం పాటించారు. ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాలకు మేరకు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదో సవత్సoరంలో అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మండలంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతోమంది త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంతో మంది మేధావుల ఆలోచన ఫలితమే తెలంగాణ ఏర్పాటు అయింది. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా ఏర్పాటు దిశగా అనేక సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అందించడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ ముందు చూపుతూ అనేక పథకాలను అమలు చేయడంతో పాటు అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్, ఎంపిఓ ప్రభాకర్, నాగిరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.