పేదరికమే గిటురాయిగా కేసీఆర్‌ పథకాలు

– గవర్నర్‌కు ధన్యవాదాల తీర్మానంలో శాసనసభ్యులు సండ్ర
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ పేదరికమే గీటు రాయిగా సంక్షేమపథకాలు రూపొంది స్తున్నారని టీఆర్‌ఎస్‌ సభ్యులు సండ్ర వెంకటవీరయ్య చెప్పారు. అందుకే దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందని చెప్పారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచా యని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని చెప్పారు. తెలంగాణ ప్రాంతం ఆనాడు కరువు, వలసలతో అల్లాడిన రాష్ట్రం నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. ధాన్యం కొనుగోలుచేసి రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. దళితులు ఆత్మగౌరవంతో బతికేలా దళి తబంధు తీసుకొచ్చామన్నారు. కంటి వెలుగు లాంటి కార్యక్రమాన్ని పంజాబ్‌, ఢిల్లీలో చేపడతామని అక్కడి ముఖ్య మంత్రులు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తలసరి విద్యుత్‌ విని యోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పా టు చేస్తున్నామన్నారు. నూతన పార్లమె ంట్‌ భవనానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరుపెట్టాలని డిమాండ్‌ చేశారు.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అలజడి సృష్టిస్తున్నది : కేపీ వివేకానంద
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అల జడి సృష్టించే ప్రయత్నం జరుగు తున్నదని బీఆర్‌ఎస్‌ కేపీ వివేకానంద విమర్శించారు. దేశంలో భారీ కుంభ కోణాలకు పాల్పడుతున్న సంస్థలను వదిలిపెట్టి, రాష్ట్రంలో పాలు, పువ్వూలు అమ్ముకునే వారిపై ఐటీ దాడులు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూ ర్వకమైనవేనని చెప్పారు. రాష్ట్ర అభివద్ధి, హైదరాబాద్‌ ప్రగతిని అడ్డుకునేందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయని విమ ర్శించారు. ఉభయసభలను ఉద్దే శించిన గవర్నర్‌ చేసిన ప్రసంగం చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. మోడీ ప్రభుత్వం అదానీ లాంటి వారికి లబ్ధి చేకూరుస్తున్నదని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ నాయ కత్వం రావాలని ప్రజలు కోరుకుం టున్నారని అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా మారా యన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలన్నీ మంచి ఫలితా లిస్తున్నాయని చెప్పారు.