స్వల్ప అస్థిరతలో మార్కెట్లు

– పీఎల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌
ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప అస్థిరత వైపు మళ్లుతున్నాయని పిఎల్‌ కాపిటల్‌ ప్రభుదాస్‌ లిల్లాధర్‌కు చెందిన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ అంచనా వేసింది. ఆ సంస్థ విడుదల చేసిన పీఎంఎస్‌ స్ట్రాటజీ అప్‌డేట్స్‌ అండ్‌ ఇన్‌సైట్స్‌ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యత, తక్కువ అస్థిరత కారకాలు సూచిస్తున్నాయని పేర్కొంది. జూన్‌, జులైలోనూ మార్కెట్లలో తక్కువ అస్థిరత ధోరణీ కనబడిందని తెలిపింది. ఆగస్టులో నిఫ్టీ 200 సూచీ 2.40 రాబడిని, నిఫ్టీ 50 సూచీ 1.73 శాతం, నిఫ్టీ 500 ఇండెక్స్‌ 1.14 శాతం చొప్పున రాబడిని అందించిందని పేర్కొంది. ”ప్రస్తుత మార్కెట్‌ డైనమిక్స్‌ ప్రకారం.. రిటర్న్‌ల గరిష్టీకరణ కంటే రిస్క్‌ కనిష్టీకరణ వ్యూహం ఉండాలని మేము నమ్ముతున్నాము. ఈ విధానం క్రమబద్ధమైన ప్రక్రియల ద్వారా బలమైన రిస్క్‌ సర్దుబాటు పనితీరును స్థిరంగా అందిస్తుంది.” అని పీఎల్‌ క్యాపిటల్‌ ఫండ్‌ మేనేజర్‌ సిద్దార్థ్‌ వోరా పేర్కొన్నారు.