– ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మెన్ పిట్టల రవీందర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రముఖ రచయిత ఆవునూరి సమ్మయ్య తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరుగని ఉద్యమం నిర్వహించారని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మెన్ పిట్టల రవీందర్ కొనియాడారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో అమరుల త్యాగాలతో పాటు ఉద్యమకారులు నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైందన్నారు. అన్ని వర్గాల ప్రజలు వివిధ స్థాయిల్లో తమ తమ అవకాశాల మేరకు రాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకమయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి, ఉద్యమ నాయకులు రామగిరి ప్రకాష్ , గుండ్లపల్లి నాగరాజు, రైల్వే జేఏసీ నాయకులు ముత్తయ్య యాదవ్ తదితరులు సీనియర్ ఉద్యమకారుడు శ్రీ ఆవు నూరి సమయను ఈ సందర్భంగా అభినందించారు.