పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌ ప్రచారకర్తగా శివమ్‌ దూబే

హైదరాబాద్‌: స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండ్‌, పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌ తమ కంపెనీకి కొత్త బ్రాండ్‌ అంబాసీడర్‌గా ప్రముఖ క్రికెటర్‌ శివమ్‌ దూబేను నియ మించు కున్నట్లు ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ ప్రతి నిధులతో పాటు శివమ్‌ పాల్గొని మాట్లాడారు. పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌ దుస్తులు చాలా ఆసక్తిగా, స్టైలిష్‌గా ఉన్నా యన్నారు. మంచి స్టైల్‌ను మెచ్చుకునే వ్యక్తిగా తాను వీటిని విపరీతంగా అభిమానిస్తున్నానని పేర్కొన్నారు.