నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముదిరాజ్ సంఘం ప్రతినిధులు గుర్రపు శేఖర్ మాట్లాడుతూ ముదిరాజ్ లను అసభ్య పదజాలంతో దూషించినందుకు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కౌశిక్ రెడ్డి వెంటనే ముదిరాజ్ లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ముదిరాజ్ లతో పెట్టుకుంటే సహించేది లేదన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్సీ పదవి నుండి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు శేఖర్, కిషన్, ప్రశాంత్, స్వామి, కిరణ్, నాగరాజు, మెంట్రాట్పల్లి ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.