నవతెలంగాణ – సిద్దిపేట
ముదిరాజ్ కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని కోరుతూ సిద్దిపేట మున్సిపాలిటీ ఒకటో వార్డు లింగారెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ ఉపాధ్యక్షులు తాటికొండ రమేష్ మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తుడైన యువ జర్నలిస్టుపై ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. ముదిరాజు కులస్రుపై దాడికి దిగిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతమన్నారు. ఇప్పటికైనా బేషారత్తుగా ముదిరాజ్ కులస్తులకు క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు తాటికొండ శ్రీనివాస్, కదుర్ల హేమంత్, తాటికొండ లక్ష్మయ్య ,కనకయ్య, రాజేశం ,రవి ,బాలు ,కనకయ్య, నరసింహులు, రాజు,భాను తదితరులు పాల్గొన్నారు.