ధర్మారంలో మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం..

నవతెలంగాణ – డిచ్ పల్లి: ధర్మారం(బి) గ్రామంలో సూర్య ఆరోగ్య సంస్థ, తెలంగాణ కమ్మ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ వైద్యశిబిరం విజయవంతం అయ్యింది. మెగా హెల్త్ క్యాంప్ శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుదర్శనం హాజరై శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత మెగా హెల్త్ శిబిరం నిర్వహించడం అభినందనీయమని, సూర్య ఆరోగ్య సంస్థ, తెలంగాణ కమ్మ సేవా సమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. స్త్రీల ఆరోగ్య సమస్యలు, గుండె నరాలు, చెవి, ముక్కు, గొంతు, దంత, ఎముకలు, కీళ్లు సమస్యలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మెగా వైద్యశిబిరానికి అనూహ్య స్పందన లభించటంతో సుమారు 500 వరకు పరీక్షలు చేసుకున్నారని తెలంగాణ కమ్మ సంఘ అధ్యక్షులు డాక్టర్ గోపాలం విద్యాసాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ రచన, సందీప్ రావు, దత్తురాజ్, కృష్ణ ఆధిత్య, ఆలోక్, ప్రవీన్ కుమార్, దీపక్ రాథోడ్, లక్ష్మణ్ గోయపాటితో పాటు సూర్య ఆరోగ్య సంస్థ, తెలంగాణ కమ్మ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.