నియోజకవర్గంలో అవినీతి పాలనకు ముగింపు పలకాలి

నవతెలంగాణ- ఆర్మూర్
నియోజకవర్గంలో అవినీతి పాలనకు ముగింపు పలకాలని బిజెపి నాయకులు పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆలూరు మండలం దెగాం గ్రామంలో బీజేపీ ఇంటింటి కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారుబిజెపి ప్రపంచంలోనే రాజకీయ పార్టీలలో గొప్ప పార్టీ అని, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ప్రపంచ దేశాలు సైతం కొనియాడే విధంగా కృషి చేస్తున్నారని. భారతీయ జనతా పార్టీ అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు లబ్ధి పొందే విధంగా వారికి సేవలందించిందని ఇందులో భాగంగా రైతులకు ఎరువుల్లో సబ్సిడీ మరియు ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిందని జన్ధన్ ఖాతాలతో ప్రతి ఒక్కరిని బ్యాంకులకు అనుసంధానం చేసింది రైతులకు పంటలకు మద్దతు ధరను పెంచి రైతులకు అన్ని విధాల వారికి మద్దతుగా ఉంటుంది మరియు ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు కోరిన చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఎంత వివక్షతో ఉందో గమనించాలన్నారు పేద ప్రజలకు భారతీయ జనతా పార్టీ అన్ని విధాల పథకాలను ప్రవేశపెట్టిందని వారు ఆర్థికంగా బలపడడానికి ప్రయత్నం చేసింది కావున ప్రజలు మరోసారి భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది అనంతరం గంగాపుత్ర సంఘానికి చెందిన 50మంది బిఅర్ఎస్ నుంచి బీజేపీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, బిజెపి మండల నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.