ఏఎన్‌ఎం పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలి

– పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ
నవతెలంగాణ – పెద్దపల్లి
జిల్లాలోని గిరిజన సంక్షేమ ప్రీ మెట్రిక్‌ హాస్టల్‌లో ఉన్న ఒక ఏఎన్‌ఎం పోస్ట్‌ కోసం ఆసక్తి, అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ప్రీ మెట్రిక్‌ హాస్టల్‌ లో 2023-24 సంవత్సరానికిగాను ఒక ఏఎన్‌ఎం పోస్ట్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, అభ్యర్థుల వయస్సు 18నుండి 44సంవత్సరములు మించరాదని, దరఖాస్తుదారు పదవ తరగతి/ ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో 18నెలలు ఏఎన్‌ఎం శిక్షణలో ఉత్తీర్ణులై ఉండాలని, దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలని తెలిపారు. గిరిజన విద్యాసంస్థలలో పనిచేసిన అనుభవం కలిగిన వారికి ఒక సంవత్సరానికి ఐదు శాతం చొప్పున గరిష్టంగా నాలుగు సంవత్సరాలకు 20శాతం వెయిటెజీ ఇవ్వబడుతుందని, అర్హత పరీక్షల్లో మెరిట్‌ మార్కులు, టీడబ్ల్యూడీ విద్యాసంస్థల్లో పనిచేసిన అనుభవానికి వెయిటేజీ ద్వారా ఎంపిక చేయబడుతుందని తెలిపారు. నెలకు రూ.22వేల750 ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా జీతం ఉంటుందని, జిల్లాలో ఒక పోస్ట్‌ ఉందని తెలిపారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన అన్ని పత్రాలతో ఆన్‌ లైన్‌ ద్వారా జూలై 13లోగా ద్వారా ఆన్లైన్‌ లో దరఖాస్తులు సమర్పించాలని మరిన్ని వివరాల కోసం 9652118867, 9985444266 సెల్‌ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.