నవతెలంగాణ -పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలంలోని నాయన వానికుంట గ్రామానికి చెందిన మేకల శ్రీకాంత్ ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. నా విజయానికి సహకరించి మాజీ సిఎల్పీ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, రాష్ట్ర పిసిసి డెలిగేట్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, జిల్లా అధ్యక్షుడు గౌని రాజ రమేష్ యాదవ్, నియోజకవర్గ అధ్యక్షులు పగడాల నాగరాజు యాదవ్, వివిధ మండలాల నాయకులకి యువజన కాంగ్రెస్ మిత్రులకి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.