కొటార్మూర్ విశ్వకర్మ నూతన అధ్యక్షునిగా శ్రీనివాస్ ఎన్నిక

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని కొటార్మూర్ విశ్వకర్మ సంఘం నూతన కార్యవర్గంలో ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తంగళ్ళపల్లి శ్రీనివాస్ ,సెక్రటరీగా రాజన్న, ట్రెజరర్ గా నరేందర్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు, సంఘ అభివృద్ధికి నిర్విరామ కృషి చేస్తానని తెలిపారు.