బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్ రెడ్డి అనారోగ్య కారణంగా సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామ్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో ఎంపిపి గాల్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సర్పంచ్ అనసూయ, మల్లారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ఉన్నారు.