ఇండియాలో షియోమీ ఇండియా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొంది..

– దేశంలో షియోమీ ఇండియా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొంది
– చదువు, పర్యావరణము మరియు నైపుణ్యాభివృద్ధి వంటి కీలకమైన రంగాలలో బ్రాండ్ అసంఖ్యాకమైన చొరవ కార్యక్రమాలను చేపట్టింది 
– రాబోవు సంవత్సరాల్లో ఈ రంగాల్లో సుస్థిరంగా పెట్టుబడి చేయడం ద్వారా జాతి నిర్మాణము పట్ల షియోమీ ఇండియా తన నిబద్ధతకు ధృఢంగా కట్టుబడి ఉంటుంది
నవతెలంగాణ – హైదరాబాద్
: దేశపు అగ్రగామి స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ టీవీ బ్రాండ్ అయిన షియోమీ ఇండియా, భారతదేశంలో తొమ్మిది విజయవంతమైన సంవత్సరాల సంబరాలను జరుపుకోవడం పట్ల ఎంతగానో గర్విస్తోంది. అనేక సంవత్సరాలుగా, తన వినూత్నమైన ఉత్పత్తులతో మరియు సామాజిక బాధ్యత పట్ల నిబద్ధతతో మిలియన్ల కొద్దీ వినియోగదారుల మనసులను గెలుచుకుంటూ బ్రాండు ఇంటింటి పేరుగా మారింది. 9 సంవత్సరాలు నిండిన తన వార్షికోత్సవ సంబరాల సందర్భంగా సమాజముపై తాను ఏర్పరచిన ప్రభావాన్ని ఎత్తి చూపుతూ షియోమీ ఇండియా తన నివేదికను విడుదల చేసింది. షియోమీ ఇండియా ఒక ఉద్దేశ్యాన్ని నెరవేర్చే బ్రాండుగా ఉంటూ వస్తోంది మరియు విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు పర్యావరణం అనే తన దృష్టిసారింపు అంశాల ద్వారా సామాజిక అభివృద్ధి దిశగా సుస్థిరంగా పని చేసింది. ప్రజల జీవితాల్ని మెరుగుపరచడానికి మరియు సమాజంపై ఒక సానుకూల ప్రభావం కలిగించడానికి టెక్నాలజీని వినియోగించుకోవడాన్ని బ్రాండు ధృఢంగా నమ్ముతుంది.తన తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో, బ్రాండు అధిగమించిన కొన్ని మైలురాళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నాయి.
Mi స్కాలర్‌షిప్ ప్రోగ్రాము: 2020లో, బ్రాండు “బడ్డీ4స్టడీ” తో భాగస్వామ్యం కుదుర్చుకొంది మరియు ఉన్నత చదువుల కోసం 5000 మంది అణగారిన వర్గాల విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేస్తూ Mi స్కాలర్‌షిప్ ప్రోగ్రాము క్రింద ఉపకార వేతనాల కొరకు 2 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. చదువు యొక్క కర్తవ్యబాధ్యతలు, దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులు తమ చదువును ఆపివేసేలా వారి మనసులను పాడు చేయకుండా ఈ చొరవ కార్యక్రమం నిర్ధారించుకొంది.
శిక్షా హర్ హాథ్:  తన చదువు సంబంధిత చొరవ కార్యక్రమాల క్రింద, షియోమీ ఇండియా, 2021 లో బాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు పరోపకారి సోనూ సూద్ గారి భాగస్వామ్యముతో “శిక్షా హర్ హాథ్” కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చొరవ కార్యక్రమం దేశంలోని అణగారిన వర్గాల పిల్లలకు విద్యను అందించింది మరియు నాణ్యమైన విద్యకు సమాన అవకాశాలు ఉండేలా చూసుకుంటూ స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ లెర్నింగ్ ప్రాప్యత చేసుకోవడానికి వారికి వీలు కలిగించింది.
కోవిడ్-19 కాలములో చదువుకు చేయూత:   సమస్యాత్మకమైన కోవిడ్-19 మహమ్మారి కాలములో, టెక్ ఫర్ ఇండియా వారితో భాగస్వామ్యముతో షియోమీ ఇండియా అణగారిన వర్గాల పిల్లలకు 2500 స్మార్ట్ ఫోన్లను అందించడం ద్వారా మద్దతును కొనసాగించింది. ఈ చొరవ కార్యక్రమం డిజిటల్ విభజన ఖాళీని భర్తీ చేసింది మరియు ఈ పిల్లలు తమ అభ్యసన ప్రయాణం కొనసాగించేలా చూసుకుంటూ ఆన్‌లైన్ విద్యను ప్రాప్యత చేసుకోవడానికి వీలు కలిగించింది.
క్యాన్సర్ నుండి బ్రతికిన వారికి విద్య: 2022లో, 200 మంది క్యాన్సర్ నుండి బ్రతికిన పిల్లల చదువు ఖర్చులను భరించడం ద్వారా వారికి చేయూతను అందించడానికి షియోమీ ఇండియా యువికెన్ ఫౌండేషన్ శక్తులతో చేతులు కలిపింది. అందరికీ చేకూర్పును మరియు సమాన అవకాశాలను ప్రోత్సహించడానికి ఈ ప్రయత్నాలు బ్రాండ్ యొక్క నిబద్ధతను ప్రదర్శించి చూపాయి.
కావేరీ పిలుపు ప్రచారోద్యమం: పర్యావరణాన్ని పరిరక్షించడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ షియోమీ ఇండియా “కావేరీ పిలుపు ప్రచారోద్యమం” కొరకు ఇషా ఫౌండేషన్ తో సమన్వయం చేసుకొంది. ఈ చొరవ కార్యక్రమం ద్వారా బ్రాండు, వరుసగా రెండు సంవత్సరాలు 2019 మరియు 2020 లో అటవీ క్షీణత, నేల కోత, మరియు నీటి కొరత వంటి కీలకమైన సమస్యలను ప్రస్తావిస్తూ 1.8 లక్షల మొక్కలను నాటడం జరిగింది.
సౌర విద్యుదీకరణ ప్రాజెక్టు: మహారాష్ట్ర లోని పాల్‌ఘర్ జిల్లాలో సుస్థిరమైన సౌర విద్యుత్ పరిష్కారాలతో గ్రామీణ ప్రజానీకాన్ని సాధికారపరచడానికి గాను యునైటెడ్ వే ఇండియా వారితో షియోమీ ఇండియా భాగస్వామ్యం వహించింది. ఈ కార్యక్రమం, ఐదు గ్రామాలకు చెందిన 1500 మంది ప్రజలలో నికర-శూన్య ఎనర్జీ సమాజాలుగా దారి తీసేలా శూన్య కలప/ శూన్య శిలాజ ఇంధనంతో వండటం, స్వచ్ఛమైన నీరు, సుస్థిర వ్యవసాయం వంటి బహుళ ప్రయత్నాలకు వీలు కలిగిస్తుంది.
లింగమార్పిడి (ట్రాన్స్ జెండర్) సమాజం కోసం నైపుణ్యాభివృద్ధి: దూరంగా నెట్టివేయబడిన సమాజాలను సాధికారపరచాల్సిన ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల నైపుణ్యాలు మరియు ఉపాధి పొందే అర్హతను బలోపేతం చేయడానికి యునైటెడ్ వే ఇండియా వారితో షియోమీ ఇండియా భాగస్వామ్యం వహించింది. ట్రాన్స్ జెండర్ వ్యక్తులు సమగ్ర జీవితాన్ని గడిపేలా వారికి అవసరమైన శిక్షణ మరియు సహాయతను అందిస్తూ, చేకూర్పు వాతావరణాలను పెంపొందించడానికి ఈ సమన్వయాత్మక ప్రాజెక్టు లక్ష్యం చేసుకుంది.
నైపుణ్య అభివృద్ధి: యువత అందరిలో నైపుణ్య అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఉపాధి, మరియు జీవనోపాధిని ప్రోత్సహించాలనే ప్రాథమిక లక్ష్యముతో షియోమీ ఇండియా అనేక చొరవ కార్యక్రమాలలో చురుగ్గా నిమగ్నం అవుతూ వస్తోంది. ఇది వ్యక్తుల ఉపాధి భవితవ్యాలను పెంపొందిస్తూ మరియు డిజిటల్ ఎకానమీకి దోహదపడేలా వారికి వీలు కల్పిస్తూ, వారిని ఆచరణాత్మక నైపుణ్యాలతో సుసంపన్నం చేస్తుంది. మొబైల్ ఫోన్ల మరమ్మత్తులో నైపుణ్యాభివృద్ధికి చేయూతను అందించడానికి గాను షియోమీ ఇండియా గ్లోబల్ హంట్ ఫౌండేషన్ వారితో భాగస్వామ్యం కుదుర్చుకొంది. ప్రాజెక్ట్ స్పార్క్ (SPARK) కొరకు ఇది భారత ఔత్సాహిక పారిశ్రామికత అభివృద్ధి సంస్థ (EDII), అహమ్మదాబాదు వారితో భాగస్వామ్యం వహించింది.
విద్యార్థుల కొరకు వినూత్నమైన టింకరింగ్ ల్యాబ్స్:  పైపెచ్చుగా ఇంకా, షియోమీ ఇండియా, యునైటెడ్ వే ఇండియా వారి సౌజన్యముతో వినూత్నమైన టింకరింగ్ ల్యాబ్స్ (ITL) ని ప్రవేశపెట్టింది. వినూత్నత, సమస్యా పరిష్కారం, మరియు ఇండియాలో వినూత్న ఆవిష్కర్తలు మరియు ఔత్సాహికవేత్తల తరాన్ని పెంపొందించేలా అప్పటికప్పుడు నేర్చుకునే అనుభవాల సంస్కృతిని పెంచి పోషిస్తూ ఈ ల్యాబ్స్ విద్యా సంస్థలలో సృజనాత్మక స్థావరాలుగా పని చేస్తాయి, తద్వారా జాతి నిర్మాణానికి దోహదపడతాయి. షియోమీ ఇండియా తొమ్మిది సంవత్సరాల విజయాన్ని పూర్తి చేసుకుంది కాబట్టి, నాణ్యమైన అభసనా అవకాశాలను, అందించడానికి, సుస్థిరమైన ఎనర్జీని ప్రోత్సహించడానికి, పర్యావరణ పరిరక్షణను పెంపొందించడానికి, మరియు దూరంగా నెట్టివేయబడిన సమాజాలకు సాధికారత కల్పించడానికి సంస్థ ఇంకనూ కట్టుబడే ఉంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వినూత్నమైన ప్రాజెక్టులు మరియు సమాజం యొక్క నిమగ్నత ద్వారా, అందరికీ ప్రకాశవంతమైన మరియు మరింత చేకూర్పుతో కూడిన భవిష్యత్తు ఉండేలా చూసుకుంటూ, సానుకూలమైన మరియు సుస్థిరమైన మార్పును సృష్టించడానికి షియోమీ ఇండియా పాటు పడుతుంది.